ఆగ్రా కోట (ఖిలా ఆగ్రా) భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఒక చారిత్రక మొఘల్ కోట. దీనిని ఆగ్రా రెడ్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. మొఘల్ చక్రవర్తి హుమాయున్ 1530లో ఈ కోటలో పట్టాభిషేకం పొందాడు. తరువాత మొఘల్ చక్రవర్తి అక్బర్ 1565 నుండి ఈ కోటను పునర్నిర్మాణం చేయించి, ప్రస్తుత నిర్మాణాన్ని 1573లో పూర్తి చేయించాడు.
1638 వరకు, రాజధాని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చే వరకు, ఈ కోట మొఘల్ వంశం పాలకుల ప్రధాన నివాసంగా ఉండేది. దీనిని "లాల్-ఖిలా" లేదా "ఖిలా-ఇ-అక్బరీ" అని కూడా పిలిచేవారు. బ్రిటిష్ వారు ఆక్రమించే ముందు, దీనిని ఆక్రమించి పాలించిన చివరి భారతీయ పాలకులు మరాఠాలు. మొఘల్ పాలనలో దీనికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా, 1983లో ఆగ్రా కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇది ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ నుండి సుమారు 2.5 కి.మీ వాయువ్య దిశలో ఉంది. ఈ కోటను మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, ఇది ప్రాకారాలతో చుట్టుముట్టిన ఒక నగరంలా ఉంటుంది. తరువాత షాజహాన్ దీనిని మరల పునరుద్ధరించాడు.
(ఇంకా…)
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.